ఈ బ్లాగ్ సంగతి

Sketchకమ్యూనికేషన్ టెక్నాలజీ  లో వస్తున్న మార్పుల్తో నిజంగానే ప్రపంచం పల్లెగా మారింది.మన పల్లెటూళ్ళళ్ళో రచ్చబండ మీద రాజకీయం, సమాజం అన్నీ సునాయాసంగా పిచ్చాపాటీగా చర్చించేసినట్టుగా, ఈ బ్లాగులో నాకు తోచిన కొన్ని విషయాలు,వ్యక్తుల గురించి జ్యోతిషపరంగా రెండు ముక్కలు రాయడం నా ఉద్దేశం. ఇదంతా ఎందుకంటే నాక్కొంచెం జాతకాల పిచ్చి. అదేలెండి – passion.  మీకూ ఆ సరదాగాని, చిన్న కుతూహలంగాని ఉంటే ఓసారి చిత్తగించండి.నచ్చినా మానినా మీరూ ఓ ముక్క comment రాయండి. స్వాగతం!

Sign

కేటగిరీస్

ఎడ్వర్డ్ స్నోడెన్ సైబర్ దొంగా?

ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా లో పుట్టి పెరిగిన ఆ దేశ పౌరుడు. అమెరికా గూఢచారి సంస్థ CIA కి, డెల్ కంప్యూటర్ కి, ఆఖరుగా NSA (నేషనల్ సెక్యూరిటి ఏజెన్సీ) కి పనిచేసాడు. 2013 మే నెల 20 వ తేదీన, రహస్యాలన్నీ పుక్కిట పట్టి, అమెరికాలోని హవాయి దీవుల్లో బయలు దేరి హాంగ్ కాంగ్...

అమరావతి – బొమ్మ రాజధాని

మొన్నటి దసరా పండగ విశేషాలే మీతో పంచుకుందామని ఈ టపా. అక్టోబరు 22 మధ్యాన్నానికి దసరా దశమి వచ్చేసింది. దాంతో పాటే ప్రధాని మోదీ విచ్చేశారు. సరాసరి ఉద్దండరాయునిపాలెం చేరుకున్నారు. విజయదశమి పర్వదినం, అన్ని పనులకీ అనువైన పెట్టని ముహూర్తం, విజయముహూర్తం అని సంప్రదాయం....