ఎడ్వర్డ్ స్నోడెన్ సైబర్ దొంగా?

ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా లో పుట్టి పెరిగిన ఆ దేశ పౌరుడు. అమెరికా గూఢచారి సంస్థ CIA కి, డెల్ కంప్యూటర్ కి, ఆఖరుగా NSA (నేషనల్ సెక్యూరిటి ఏజెన్సీ) కి పనిచేసాడు. 2013 మే నెల 20 వ తేదీన, రహస్యాలన్నీ పుక్కిట పట్టి, అమెరికాలోని హవాయి దీవుల్లో బయలు దేరి హాంగ్ కాంగ్ చేరుకున్నాడు. అక్కడకు చేరుకున్నాక, అమెరికా గూఢచార కార్యకలాపాలకు సంబంధంచిన వేలకొద్దీ సమాచార పత్రాలను, ది గార్డియన్, ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికల ద్వారా ప్రపంచానికి లీక్ చేసాడు. హాంగ్ కాంగ్ నుంచి రష్యా పారిపోయి తలదాచుకున్నాడు. సున్నితమయిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ద్వారా వ్యక్తిగత ప్రయివసీని తద్వారా పౌర స్వేఛ్ఛను కాల రాస్తున్న ప్రభుత్వ అనైతిక చర్యలు ప్రజలకు, బాహ్యప్రపంచానికి తెలియ చెప్పాలన్న ఉన్నత మనోధర్మాన్ని పాటించానంటాడు స్నోడెన్. దేశ భద్రతకి తీరని ముప్పు తెచ్చాడు, టెరరిస్టులకి ఇంటిగుట్టు రట్టు చేసాడు, దేశద్రోహి,...

Read More