అమరావతి – బొమ్మ రాజధాని

మొన్నటి దసరా పండగ విశేషాలే మీతో పంచుకుందామని ఈ టపా. అక్టోబరు 22 మధ్యాన్నానికి దసరా దశమి వచ్చేసింది. దాంతో పాటే ప్రధాని మోదీ విచ్చేశారు. సరాసరి ఉద్దండరాయునిపాలెం చేరుకున్నారు. విజయదశమి పర్వదినం, అన్ని పనులకీ అనువైన పెట్టని ముహూర్తం, విజయముహూర్తం అని సంప్రదాయం. కట్టనున్నది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని, అమరావతి! సూత్రధారి తెలుగుదేశం అధినేత – శంకుస్థాపన చసేది దేశ ప్రధాని, ఆత్మీయ అథిది దాయాది చంద్రన్న, అతిరధ మహారధులు అనుకున్న వారందరికీ ఆహ్వానాలు – ఇదీ నేపథ్యం. ఈనాడు దినపత్రిక జెండా శీర్షిక ప్రకారం శంకుస్థాపన సుమూహుర్తం మధ్యాహ్నం 12:36 నుండి 12:43 మధ్యన. ముహూర్త నిర్ణయం చేసిన జ్యోతిష్కులు, విషయం ప్రాముఖ్యతను బట్టి, వారికున్న పరిధిలో లోతుగా పరిశీలించే ఉంటారు. అవకాశం ఉన్నంతలో ఉత్తమోత్తమం అయిన సమయం ఎంపిక చేసే కృషి చేసి ఉంటారు. ఆ పైన ఏలినవారి ఊహలు, ఉద్దేశాలు, బేరీజులు, వ్యూహాలు...

Read More